IND vs AUS: మూడవ టెస్టు గెలవాలంటే ఇండియా టార్గెట్ 275..! 4 d ago
మూడవ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఇండియాకు 275 రన్స్ టార్గెట్ ఇచ్చింది. నిజానికి ఐదో రోజు అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. 7 వికెట్లు కోల్పోయి 89 రన్స్ చేసిన దశలో రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. వర్షం వల్ల తొలి సెషన్ చాలా వరకు నిలిచిపోగా, ఇక రెండవ సెషన్లో ఆసీస్ బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. భారత పేస్ బౌలర్లు బుమ్రా 3, ఆకాష్ దీప్ 2, సిరాజ్ 2 వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ తోకముడిచింది.